భారతదేశం, మార్చి 12 -- శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శుభవార్త. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్‌లు మంజూరు చేసింది.

ఈ హల్ట్‌ల ద్వారా జిల్లాలోని అంతర్గత ప్రాంతాలకు రవాణా సౌకర్యం, విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..

ఈ కొత్త స్టాపేజీల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన రైల్వే కనెక్టివిటీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని పేర్కొన్నారు రామ్మోహన్ ...