భారతదేశం, సెప్టెంబర్ 25 -- తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో సహజ్ మార్గ్ స్పిరిచువాలిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు జరగనుంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి వేలాదిమంది భక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్ట్యా వారి సౌకర్యార్థం వికారాబాద్, షాద్‌నగర్ రైల్వే స్టేషన్లలో పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా ఒక నిమిషం పాటు నిలుపుదల (హాల్టింగ్) కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

కన్హా శాంతివనానికి వెళ్లే భక్తులు ఈ తాత్కాలిక సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ఈ వేళలకు అనుగుణంగా సిద్ధం చేసు...