భారతదేశం, మార్చి 24 -- రైల్వే టిక్కెట్ రద్దు నిబంధనలలో ఒక ప్రధాన మార్పు చేసింది భారతీయ రైల్వే. ఇకపై రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు వరకు ఎవరైనా టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. వారికి ఒక్క పైసా కూడా వాపసు లభించదు. రైలు బయలుదేరడానికి 24 నుండి 72 గంటల మధ్య ప్రయాణికులు తమ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 25 శాతం కోత విధిస్తారు. అంతేకాకుండా రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటలలోపు టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఎలాంటి డబ్బు రీఫండ్ చేయరు.

రైల్వే బోర్డులోని అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఒక ప్రయాణికుడు రైలు బయలుదేరడానికి 24 నుండి 72 గంటల మధ్య తన టిక్కెట్టును రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 25 శాతం కోత విధించి మిగిలినది రిఫండ్ చేస్తారు. అదే 72 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మాగ్జిమమ్ రిఫండ్ ఉంటుంది. గతంలో 24 నుండి 28 గంటల మ...