భారతదేశం, నవంబర్ 9 -- రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఉత్తర రైల్వే (Northern Railway) గొప్ప అవకాశం కల్పించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - నార్తర్న్ రీజియన్ (RRC NR) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 4,651 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌ఆర్‌సీ ఎన్‌ఆర్ అధికారిక వెబ్‌సైట్ rrcnr.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 నవంబర్ 11న ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమర్పించడానికి 2026 డిసెంబర్ 11 వరకు గడువు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను 2027 ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశముంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి (ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్) ...