భారతదేశం, నవంబర్ 19 -- వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్లిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ యోజన రెండో విడత నిధులను విడుదల చేశారు. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3200 కోట్ల నిధులను విడుదల అయ్యాయి. రూ.7వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రూ..5వేలు కాగా.. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు రూ.2 వేలు ఉన్నాయి.

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయో రాలేదో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతు ఆధార్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చు. దీని ద్వారా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది.

annadathasukhibhava.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

హోమ్‌పేజీలోని "Know Your Status" అనే లి...