భారతదేశం, జూన్ 22 -- కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన హయాంలో సాగు రంగానికి మోసం మాత్రమే మిగిలిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతోనే కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ చంద్రబాబు రైతాంగాన్ని వంచించారని ఆరోపించార మోసం చేయడంలో తన పాత రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటున్నారని జగన్ విమర్శించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరిస్తూ వైఎస్ జగన్ పలు గణాంకాలను విడుదల చేశారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు తమ ప్రభుత్వం 53.58 లక్షల రైతు కుటుంబాలకు ఎలాంటి అంతరాయం లేకుండా, క్రమం తప్పకుండా '...