భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఈ క్రాప్ బుకింగ్‌ కోసం రైతులకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. వెంటనే రైతులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాల కోసం ఈ క్రాప్ డేటా తప్పనిసరి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, వాతావరణ ఆధారిత బీమా పథకంలాంటి వాటి ప్రయోజనాలు పొందవచ్చు. ఇన్సూరెన్స్ పొందడానికి కచ్చితంగా క్రాప్ బుకింగ్ తప్పనిసరి. పంట వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, ఆపత్కాలంలో బీమా సౌకర్యం అందిస్తున్నాయి.ఈ పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా క్రాప్ బుకింగ్‌లో తమ పంటను నమోదు చేయాలి. ఏపీలో క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. రైతులు తక్షణం ...