భారతదేశం, ఆగస్టు 3 -- రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా చెల్లించే చివరి తేదీని ఈ నెల ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక భక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఇంతకుముందు నిర్ణయించిన తుది గడువు దగ్గర పడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ-సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(CSC), గ్రామ/వార్డు సచివాలయాల వద్ద రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఒకేసారి వేలాది మంది పోర్టల్‌లోకి రావడంతో సాంకేతిక లోపాలు, సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

దీంతో చాలామంది అర్హులైన రైతులు నమోదు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితిని గ్రహించిన రాష్ట...