భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా మంది అనర్హులు సంక్షేమ పథకాలను పొందుతున్నారని, అర్హులకు అందడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలకు దరఖాస్తు చేయాలంటే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కచ్చితంగా కావాలి.

ఎందుకు అంటే చాలా మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు అందకుండా, అర్హులే ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంది. అందుకే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తు కోసం రేషన్ కార్డును అనుసంధానించాలి. ఇక రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుంది.

ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి అంటే మీసేవలో ఆధార్ నెంబర్ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవడం ఒక విధానంగా ఉండేది. దీనికి రేషన్ కార్డు...