భారతదేశం, జూలై 8 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని వాగ్దానాలపై బహిరంగ చర్చకు దూరంగా ఉందని ఆరోపించారు. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తే ఆయన చర్చకు రాలేదని, రేవంత్ మాట తప్పుతారని తెలిసినా.. సవాల్ స్వీకరించానని చెప్పారు. సీఎం రాకపోయినా కనీసం మంత్రులు ఎవరైనా చర్చకు వస్తారని అనుకున్నానని కేటీఆర్ అన్నారు. రేవంత్ సవాలును స్వీకరించిన కేటీఆర్ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు ఇతర బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వచ్చారు.

ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అంతరాయం లేకుండా లేదా మైక్ డిస్‌కనెక్ట్ లేకుండా మాట్లాడటానికి అనుమతిస్తే.. అసెంబ్లీలో అధికార పార్టీపై చర్చించడానికి కూడా బీ...