భారతదేశం, ఆగస్టు 19 -- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ లో మరోసారి మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిల లక్ష్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవాళ పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా సుష్మితా పటేల్ ప్రసంగించారు. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని అన్నారు. పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదంటూ ఘాటుగా మాట్లాడారు.

"రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, ప్రకాశ్ రెడ్డి వచ్చినా. ఆయన తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను ...