భారతదేశం, ఆగస్టు 11 -- తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వివాదంతో తీవ్ర వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 1 లక్ష కేపిటల్ ఉన్న ఒక షెల్ కంపెనీకి కట్టబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ వ్యవహారాన్ని తొలుత బయటపెట్టగా కేటీఆర్ విలేకరుల సమావేశంలో దీనిపై ఆధారాలను బయటపెట్టారు. పటాన్‌చెరులోని ఒక చిన్న ఇంటి చిరునామాతో నమోదైన 'టెస్సెరాక్ట్' సంస్థకు ఒక్క ఉద్యోగి కూడా లేరని కేటీఆర్ అన్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్‌గా 12345678 అని పొందుపరచడం ఈ సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు.

రూ. 200 కోట్ల విలువైన భూకేటాయింపులను ప్రారంభ మూలధనం కేవలం ల...