భారతదేశం, మార్చి 23 -- అర్సెలార్ మిత్తల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిత్తల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామన్నారు.

ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని గుర్తుచేశారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో కృషి చేసిన ఆదిత్య మిత్తల్, మంత్రి నారాలోకేష్‌ను అభినందించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందన్నారు.

'అనకాపల్లిలో కేవలం స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదు..స్టీల్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ తో పాటు 11,198...