భారతదేశం, జూన్ 10 -- అధిక మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి ఏది? దాని వల్ల కలిగే పుణ్యఫలం ఏంటో వివరించాలని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని కోరాడు. ఈ లోకంలో మనుషులు పాపాలను పోగొట్టుకుని, పరమపదాన్ని పొందేలా చేసే ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలపాలని అడిగాడు. అందుకు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు స్పందిస్తూ.. "రాజన్! శుక్ల పక్షం కావచ్చు, కృష్ణ పక్షం కావచ్చు.. ఏకాదశి తిథి వస్తే మాత్రం ఉపవాసాన్ని వదలకూడదు. ఎందుకంటే ఇది మోక్షాన్ని ప్రసాదించే పవిత్రమైన రోజు," అని వివరించాడు. అధిక మాసంలో వచ్చే రెండు ఏకాదశులు ఎంతో ప్రత్యేకమైనవి. వాటిలో ఒకటి పద్మిని ఏకాదశి కాగా, మరొకటి పరమ ఏకాదశి. ఈ పరమ ఏకాదశినే పద్మపురాణంలో 'కమలా ఏకాదశి' అని కూడా పిలుస్తారు.

కలియుగంలో భవ బంధాల నుంచి విముక్తి కలిగించడానికి, కోరిన కోర్కెలు తీర్చి సుఖసంతోషాలు ఇవ్వడానికి, చేసిన పాపాలను సమూలంగా నాశనం చే...