భారతదేశం, జనవరి 1 -- ఆటోమొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కియా సెల్టోస్, ఇప్పుడు సరికొత్త జనరేషన్ మోడల్‌తో మన ముందుకు వస్తోంది. 2026 సంవత్సరంలో దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న మొదటి కారు ఇదే కావడం విశేషం. రేపు, అంటే జనవరి 2న కియా ఇండియా ఈ కారు ధరలను అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే రూ. 25,000 టోకెన్ అమౌంట్‌తో ఆన్‌లైన్, డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా, అత్యాధునిక సాంకేతికతతో వస్తున్న ఈ 2026 కియా సెల్టోస్‌లోని టాప్ 5 హైలైట్స్ ఇవే..

కొత్త సెల్టోస్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ముందు భాగంలో సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ (LED DRL) సిగ్నేచర్, నిలువుగా ఉండే హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ ...