భారతదేశం, మే 27 -- బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న నాయకత్వ సందిగ్ధత క్లైమాక్స్‌కు చేరుకుంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న 'అధికార పోరు' (Power Struggle) లో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకోనున్నారనే వార్తలకు పలు పరిణామాలు మద్దతు పలుకుతున్నాయి.. ఈ ఉత్కంఠ భరిత పరిణామాల మధ్య, రేపు (మే 28, గురువారం) ఉదయం బెంగళూరులోని సీఎం అధికారిక నివాసం 'కావేరి'లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య అల్పాహార విందు ఇవ్వనున్నారు. ఈ భేటీ కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పిడికి అధికారిక ముహూర్తంగా భావిస్తున్నారు.

మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన సుదీర్ఘ చర్చలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో జరిగిన విడివిడి భేటీల్లో.. సిద్ధరామయ్యకు గౌరవప్ర...