భారతదేశం, అక్టోబర్ 24 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను చూడాల్సి ఉంటుంది.

రేపు శరద్ పౌర్ణమి. ఈ పౌర్ణమి వేళ కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. కొన్ని గ్రహాల సంచారంలో మార్పు వలన ఈ శరద్ పూర్ణిమ నాడు కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. అక్టోబర్ 25, ఆదివారం నాడు వస్తున్న ఈ పౌర్ణమి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మోసుకొస్తుంది.

రేవతి నక్షత్రం, హర్షణ యోగం కలవనున్నాయి. దీంతో ఈ పౌర్ణమికి కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అలాగే, తులా రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు సంచరించడంతో త్రిగ్రహ యోగం కూడా ఏర్పడింది. ఈ గ్రహాల కారణంగా ఈ రాశుల వారు చక్కట...