భారతదేశం, ఆగస్టు 12 -- శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్ర మాసాల్లో ఒకటి. ప్రాంతాన్ని బట్టి శ్రావణమాసం తేదీలు, ఆచారాలు మారుతూ ఉంటాయి. తెలుగు పంచాంగం సాంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణమాసం ఉంది.

శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో శివుడిని కూడా ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కూడా చాలా విశేషమైనది. శ్రావణ మాసంలో చేయాల్సిన పరిహారాలు, శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటుగా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. శివుడికి సమర్పించి, ఓం నమ: శివాయ మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే సోమవారాలను శివారాధనకు ప్రత్యేకంగా భావించే సాంప్రదాయం కూడా ఉంది.

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ...