భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఇంట్లో ఎంత బాగా వండినా.. రాని రుచి.. రెస్టారెంట్లలో దొరుకుందని చాలా మంది చెబుతుంటారు. అందుకే ప్రతీవారం రెస్టారెంట్‌లకు వెళ్తుంటారు. వీకెండ్ వస్తే.. కచ్చితంగా బయట తినాల్సిందేనని కొందరు రూల్ పెట్టుకుంటారు. కానీ అలాంటివారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్‌లాంటి సిటీల్లోని చాలా రెస్టారెంట్లలోని ఫుడ్ సరికాదని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు సంబంధించిన పలు బ్రాంచీల్లో తనిఖీలు చేయగా.. దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి.

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌కు చెందిన పది అవుట్‌లెట్‌లను తనిఖీ చేశారు. వీటిల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. మురికి పాత్రలు, బొద్దింకలు, ఎక్స్‌పైరీ ఆహారం, సరిగా నిల్వ చేయని ఆహారం, అపరిశుభ్రమైన ఫ్లోరింగ్, వాషింగ్ ఏరియాలను చూశారు. వీటికి సం...