భారతదేశం, సెప్టెంబర్ 30 -- తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీలో వచ్చే నాలుగు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. అక్టోబర్ 1వ తేదీ నాటికి మధ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుంది. అక్టోబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది మూడో తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీంతో ఏపీలోని అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం...