భారతదేశం, అక్టోబర్ 7 -- భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాల అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10:00 గంటలకు రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయంగా ఎగిసిపడుతున్న చమురు ధరల నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంచుతున్నట్టు ప్రకటించింది.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బెంచ్ మార్క్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు 5.5 శాతానికి చేరుకుంది.

పెరుగుతున్న ముడిచమురు ధరలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణ ముప్పును అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ గవర్నర్ స్ప...