భారతదేశం, జూన్ 26 -- మధ్య కాలంలో చిన్న కారణాలకే మనుషులను చంపుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ప్రియుడి కోసం భర్తను, కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. వీటికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణం అవుతుంది. కొందరు సోషల్ మీడియాలో పరిచయమైన కొంతకాలానికే పీకల్లోతు మాయలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో రెండు రోజుల ఫేస్‌బుక్ పరిచయం మహిళను చంపేసింది.

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళను 28 ఏళ్ల యువకుడు హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. నిందితుడు పునీత్ గౌడను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మృతురాలిని హసన్ జిల్లాకు చెందిన ప్రీతి సుందరేష్‌(39)గా గుర్తించారు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

నిందితుడు పునీత్ గౌడ మాండ్య జిల్లాకు చెందినవాడు....