భారతదేశం, డిసెంబర్ 14 -- తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపించింది.

తెలంగాణ రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్ఈసీ ప్రకటించింది. 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వార్డు సభ్యుల పదవులకు 71,071 మంది పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు నుంచి చేశారు.

54,40,339 మంది అర్హత కలిగిన ఓటర్లలో 46,70,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 85.86 శాతం పోలింగ్ నమోదైందని పత్రికా ప...