భారతదేశం, జనవరి 20 -- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'జవాన్' ఫేమ్ అట్లీ (Atlee) ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అట్లీ, అతని భార్య ప్రియ తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. ప్రియ రెండోసారి గర్భం దాల్చినట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ శుభవార్తను పంచుకుంటూ అట్లీ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మనసుకు హత్తుకునే ఫోటోలను షేర్ చేశారు. మెహందీ గ్రీన్ రంగు దుస్తుల్లో ప్రియ తన బేబీ బంప్‌ను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తుండగా, అట్లీ ఆమె పక్కన ఆప్యాయంగా నిల్చున్నాడు.

ఈ ఫోటోలలో వారి మొదటి కుమారుడు మీర్ 'బిగ్ బ్రదర్'గా పోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. అంతేకాకుండా, వారి పెంపుడు కుక్కలు (బెకీ, యుకీ, చాకీ, కాఫీ, గూఫీ) కూడా ఈ ఫ్రేమ్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

"మా ఇల్లు ఇప్పుడు మరింత అందంగా మ...