భారతదేశం, సెప్టెంబర్ 29 -- హైదరాబాద్‌లో రూ.5కే అల్పాహారం అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) విడుదల చేసిన ఒక ప్రకటనలో, అధిక సబ్సిడీ ధరలకు పోషకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం, వేలాది మంది నిరుపేద పౌరులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ క్యాంటిన్ల లక్ష్యం అని తెలిపింది.

ఈ క్యాంటీన్లలో ప్రతి అల్పాహారం, భోజనం ధర రూ.5గా మాత్రమే ఉంటుంది. అల్పాహారానికి రూ.14 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు నెలకు రూ.3,000 వరకు ఆదా చేసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని మోతినగర్, ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ దగ్గరలో క్యాంటీన్లను ప్రారంభించారు.

'నేటి నుండి, రూ. 5 కి అల్పాహారం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని ...