భారతదేశం, ఆగస్టు 20 -- రూ. 5800 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ(ఏపీటీ) వ్యవస్థను ఆవిష్కరించింది పోస్టల్ శాఖ. భారతీయ పోస్టల్ సర్వీస్‌కు ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను ఇస్తుంది. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిని భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా ఇండియా పోస్ట్ ప్రపంచ స్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుతుందని అన్నారు. ఈ కామర్స్‌కు బూస్టింగ్ ఇస్తుందని చెప్పారు.

ఐటీ 2.0 కార్యక్రమం కింద రూ. 5800 కోట్ల పెట్టుబడితో అధునాతన పోస్టల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. దీని తర్వాత మీ గ్రామ పోస్టాఫీసు స్మార్ట్‌గా మారుతుంది.

అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ(ఏపీటీ) అనేది పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్త డిజిటల్ వ్యవస్థ. ఇది దేశవ్యాప్తంగా అమలు అవుతుంది. దీని సహాయంతో పోస్టల...