భారతదేశం, నవంబర్ 17 -- ఈ ఏడాది ఆరంభంలో మెరుపు వేగంతో దూసుకెళ్లి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచిన వెండి ధరలు ఇప్పుడు అనూహ్యంగా కుప్పకూలాయి. 2026 జనవరిలో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో కిలో రూ.4 లక్షల మైలురాయిని దాటిన వెండి, ప్రస్తుతం రూ.1.75 లక్షల దిగువకు పడిపోయింది. రికార్డు స్థాయి గరిష్ఠాల నుంచి దాదాపు 60 శాతం మేర విలువను కోల్పోవడంతో, వెండి పరుగుకు బ్రేక్ పడిందా అన్న చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైంది.

మంగళవారం (నవంబర్ 17) ఎంసీఎక్స్ డిసెంబర్ ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర అంతకుముందు ముగింపు రూ.1,68,183తో పోలిస్తే 1.3 శాతం పెరిగి రూ.1,70,065 వద్ద ట్రేడ్ అయింది. అయితే అంతకుముందు జరిగిన భారీ పతనం ముందు ఈ స్వల్ప రికవరీ ఏమాత్రం సరిపోవడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వెండిపై ఒత్తిడి కొనసాగుతోంది. సోమవారం కామెక్స్ (COMEX) ఫ్యూచర్స్‌లో వెండి 52 వారాల కనిష్ఠ...