భారతదేశం, ఆగస్టు 25 -- బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కేవలం రూ.147కే 30 రోజుల వాలిడిటీ అందిస్తోంది. దీనితో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ పూర్తి వివరాలు చూద్దాం..

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇతర ప్రైవేట టెలికాం కంపెనీలు రేట్లు పెంచుతుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ రేట్లతో ఆకర్శిస్తోంది. చాలా మంది మొబైల్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు పోర్ట్ అవుతున్నారు.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తరచుగా తన వినియోగదారుల కోసం చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతుంది. ఇతర నెట్‌వర్క్‌ల రీఛార్...