భారతదేశం, జూన్ 8 -- హైదరాబాద్‌లో భూ మాఫియా గుప్పిట ఉన్న ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా (Hydraa - Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆక్రమణదారుల చెర నుంచి విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను కాపాడుతూ సరికొత్త మైలురాయిని అధిగమించింది.

గడిచిన రెండేళ్ల కాలంలోనే ఏకంగా రూ. 1,10,000 కోట్ల (లక్షా పది వేల కోట్లు) విలువైన ప్రభుత్వ భూములను విడిపించి, తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారికంగా ప్రకటించారు.

హైదరాబాద్ నగర ప్రజల నుంచి లభించిన అపారమైన మద్దతు, ప్రోత్సాహం వల్లే ఈ అసాధ్యమైన టాస్క్ సాధ్యమైందని కమిషనర్ రంగనాథ్‌ చెప్పారు. ఇదే వేగంతో ముందుకు సాగుతూ, వచ్చే ఏడాది నాటిక...