భారతదేశం, జూన్ 11 -- భారతీయ స్టాక్ మార్కెట్ ఇటీవల కాలంలో ఎంతోమంది రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచింది. దీర్ఘకాలిక పెట్టుబడులే ఊహించని లాభాలకు రాజమార్గమని నిరూపిస్తూ దలాల్ స్ట్రీట్‌లో ఒక స్మాల్-క్యాప్ డిఫెన్స్ స్టాక్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అదే రక్షణ రంగ సాంకేతిక సంస్థ 'నిబే' (Nibe) లిమిటెడ్. గత కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధితో దూసుకుపోతున్న ఈ షేరు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ మల్టీబ్యాగర్‌గా అవతరించింది.

పదేళ్ల క్రితం కేవలం రూ. 8 వద్ద ట్రేడైన నిబే షేరు విలువ, ప్రస్తుతం రూ. 1,437 స్థాయికి చేరుకుంది. అంటే ఈ పదేళ్ల కాలంలో దాదాపు 17,862 శాతం వృద్ధిని నమోదు చేసింది. పదేళ్ల క్రితం ఈ షేరులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు విక్రయించకుండా దాచుకున్న ఇన్వెస్టర్ల సొమ్ము ఇప్పుడు ఏకంగా రూ. 1.8 కోట్లకు చేరింది. సరైన షేర్లను...