Andhrapradesh, ఆగస్టు 8 -- ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం ఓ అధికారి భారీగా లంచం ఆశించాడు. ఏకంగా రూ. 50 లక్షలకు టెండర్ పెట్టాడు. ముందుగానే రూ. 25 లక్షలు తీసుకున్న సదరు అధికారి. మరో రూ. 25 లక్షలు ఇవ్వాలని గుత్తేదారిని డిమాండ్ చేశాడు. అప్పటికే రూ. 25 లక్షలు సమర్పించుకున్న బాధితుడు.. మరో రూ. 25 లక్షలు ఇవ్వలేక ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఆ అధికారి అడ్డంగా దొరిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్ సీ శ్రీనివాస్ రూ. 25 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం ఈఎన్ సీ శ్రీనివాస్ మొదట రూ. 25 లక్షలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత మరో రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నంలోని శ్రీ సత్య సాయి కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట...