భారతదేశం, సెప్టెంబర్ 14 -- ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులు ప్రజలు ఇచ్చే పన్నుల సొమ్ముకు జవాబుదారీగా ఉండాలనేది ప్రజాస్వామ్య సూత్రం. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు తమ సౌందర్య పోషణకు, అలంకరణకు పెట్టిన ఖర్చులు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 2019 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు.. అంటే దాదాపు ఏడేళ్ల కాలంలో ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏకంగా 4,70,000 డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4.49 కోట్లు) వెచ్చించింది. ఇందులో ఏకంగా 90 శాతానికి పైగా నిధులు ఒక్క నెతన్యాహు దంపతుల కోసమే ఖర్చవడం గమనార్హం.

సమాచార హక్కు ఉద్యమ సంస్థ తరఫున న్యాయవాది యారా వింక్లర్ షాలిట్ 2025 డిసెంబర్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగాక, ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ...