భారతదేశం, అక్టోబర్ 6 -- రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారం కలకలం రేపింది. ఫిజియోథెరపీ సెంటర్ పై విధించిన సీజ్ ను ఎత్తివేయటంతో పాటు... కొత్త లైసెన్స్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎమ్‌హెచ్‌ఓ) స్వర్ణకుమారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇదే కేసులో హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్యను కూడా అదుపులో తీసుకున్నారు.

ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..... రంగారెడ్డి జిల్లా డిఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ బి. స్వర్ణకుమారి (AO-1), అదే కార్యాలయంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాస్ (AO-2) సూచనల మేరకు ప్రైవేటు డ్రైవర్ మద్దూరి కృష్ణయ్య (A-3) బాధితుడి నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు నడుపుతున్న ఫిజియోథెరపీ సెంటర్‌...