Hyderabad,telangana, సెప్టెంబర్ 20 -- హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.12 కోట్ల విలువైన 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ మహిళా ప్రయాణికురాలని అరెస్టు చేశారు.

నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ఒక భారతీయ ప్రయాణికురాలిని విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ప్రయాణికురాలి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా. ఆకుపచ్చ, ముద్ద పదార్థం ఉన్న ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వీటిని గంజాయికి సంబంధించిన పదార్థాలుగా గుర్తించారు. ఒక లగేజీ నుంచి మొత్తం ఆరు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికురాలిని పూర్తిస్థాయిలో విచారించగా. మరో బ్యాగ్ మిస్ అయినట్లు తెలిపింది. దీని...