భారతదేశం, ఆగస్టు 21 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న 'స్కోడా కైలాక్' ఎస్‌యూవీ లైనప్‌ను కంపెనీ మరింత విస్తరించింది. స్పోర్టి డిజైన్, మెరుగైన ఫీచర్లతో కూడిన కొత్త 'స్పోర్ట్‌లైన్' వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను రూ. 11.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా సంస్థ నిర్ణయించింది. కైలాక్ స్పోర్ట్‌లైన్ రాకతో ఈ సిరీస్‌లో మొత్తం వేరియంట్ల సంఖ్య ఏడుకు (క్లాసిక్, క్లాసిక్+, సిగ్నేచర్, సిగ్నేచర్+, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్+) చేరింది.

స్కోడా మోటార్‌స్పోర్ట్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను ఆకర్షణీయమైన డార్క్ థీమ్‌తో తీర్చిదిద్దారు. డీప్ బ్లాక్ ఓఆర్‌విఎమ్‌లు (ORVMs), గ్లాసీ బ్లాక్ ఫ్రంట్, రియర్ డిఫ్యూజర్లు, టెయిల్‌గేట్‌పై నల్లటి బ్రాండింగ్, డీప్ బ్లాక్ డ్యూయల్-టోన్ రూఫ్‌ ఈ కార...