భారతదేశం, నవంబర్ 28 -- న్యూఢిల్లీ: హర్యానాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (MDU)లో మహిళా పారిశుద్ధ్య కార్మికులు తమ రుతుస్రావాన్ని (periods) నిరూపించుకోవడానికి ప్రైవేట్ భాగాల ఫోటోలను చూపించాల్సిందిగా అడిగారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతరులను కోరుతూ నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.
"ఇది (అధికారుల చర్య) వారి ఆలోచనా ధోరణిని, మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పీరియడ్ లీవ్ (రుతుస్రావ సెలవు) ఇస్తున్నారు. ఈ ఉదంతం విన్నాక, సెలవు ఇవ్వడానికి ఇలాంటి నిరూపణలు అడుగుతారేమోనని నాకు అనిపించింది" అని జస్టిస్ నాగరత్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జస్టిస్ నాగరత్న మరింత స్పందిస్తూ "ఇది ఆ వ్యక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.