భారతదేశం, ఆగస్టు 11 -- ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్ సిమ్‌తో వస్తున్నాయి. వినియోగదారులు ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఒక సిమ్‌కు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటారు. ఎక్కువ రోజులు ఒక నెంబర్ రీఛార్జ్ చేసుకోకపోతే దాన్ని క్లోజ్ చేసి వేరొకరికి ఇవ్వొచ్చని చాలా మంది యూజర్లు అర్థం చేసుకోరు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చాలా కఠినమైన నిబంధనలను రూపొందించింది. వాటి ప్రకారం, పాత నంబర్‌ను మూసివేసి మళ్లీ వేరొకరికి జారీ చేస్తారు.

చాలా కాలంగా రీచార్జ్ చేయకపోవడంతో క్రికెటర్ రజత్ పాటిదార్ పాత నంబర్ క్లోజ్ కావడంతో కొత్త యూజర్ కు అది రావడంతో ఓ ఫన్నీ సంఘటన వెలుగులోకి వచ్చింది. రజత్ పాత నంబర్ పొందిన యూజర్‌కు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి పెద్ద క్రికెటర్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో ఆ య...