రియల్మీ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ లీక్స్.. 10,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో !
భారతదేశం, నవంబర్ 26 -- మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో కొత్త మోడల్‌ను రంగంలోకి దించేందుకు రియల్మీ సన్నాహాలు చేస్తోంది. 'రియల్మీ 17 ప్రో' పేరుతో రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ హ్యాండ్సెట్ ఎలా ఉండబోతోందో చూపించే రెండర్ చిత్రాలు ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. లీకైన ఫోటోల ప్రకారం, ఈ ఫోన్ చతురస్రాకార కెమెరా మాడ్యూల్, హోల్-పంచ్ డిస్ప్లే వంటి తెలిసిన డిజైన్‌నే కొనసాగించనుంది. ఇందులో ఏకంగా 10,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ అమర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ 'ఎక్స్' వేదికగా రియల్మీ 17 ప్రోకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు, వెనుక భాగాల రూపురేఖలను ఈ చిత్రాలు చూపిస్తున్నాయి. గత మోడల్ డిజైన్ శైలినే ఇందులోనూ కొనసాగిస్తారని ఈ ఫోటోలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.