భారతదేశం, నవంబర్ 4 -- అమెరికా అధ్యక్షుడికి గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలను డెమొక్రాట్లు కైవసం చేసుకోవడంతో మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ పరాజయం పాలైంది. ఈ ఎన్నికల ఫలితాలతో బుధవారం (నవంబర్ 4) గ్లోబల్ మార్కెట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. డాలర్ విలువ, ట్రెజరీ ఈల్డ్స్ బలహీనపడటంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మరోవైపు గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటంతో భారత్ సహా ఎమర్జింగ్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు (FIIs) వెల్లువెత్తుతాయన్న అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి.

పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఓటర్లు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో రాబోయే రెండేళ్లలో భారీ బడ్జెట్ లో...