రిటైర్మెంట్కు నాలుగేళ్ల ముందే రికార్డుల తనిఖీ.. కేంద్రం కొత్త నిబంధనలు
భారతదేశం, అక్టోబర్ 16 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, పెన్షన్ వ్యవహారాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పే ఫిక్సేషన్ (వేతన సవరణ) ఆర్డర్లు, సర్వీస్ రికార్డులు, పెన్షన్కు సంబంధించిన వివరాలను వారు పదవీ విరమణ చేయడానికి నాలుగేళ్ల ముందే సమగ్రంగా సమీక్షించాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం (Department of Expenditure) ఆదేశించింది. అదనపు చెల్లింపులను చాలా ఆలస్యంగా గుర్తించి, ఆ తర్వాత రికవరీ చేయడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను నివారించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
తప్పుగా చేసిన పే ఫిక్సేషన్లు, వార్షిక ఇంక్రిమెంట్లు, అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఏసీపీ), మోడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఎంఏసీపీ) పథకాల కింద దక్కిన ప్రయోజన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.