భారతదేశం, అక్టోబర్ 5 -- జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అకస్మాత్తుగా జరిగే పరిణామాలు, ఉన్నత ఆశయాలు, భ్రమలు అలాగే ఊహించని మలుపులకు కారకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో రాహువు తన గమనాన్ని మారుస్తూ తాజాగా కుంభ రాశిలోని ధనిష్ఠ నక్షత్ర పాద సంచారంలో ప్రవేశించాడు. ఈ నక్షత్ర మార్పు ఎందుకు ప్రాధాన్య సంతరించుకుందంటే, ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ 5న రాహువుతో పాటు కేతువు కూడా పెద్ద ఎత్తున రాశి మార్పు చేయనున్నారు.

అటు కుంభం నుంచి మకరంలోకి రాహువు, ఇటు సింహం నుంచి కర్కాటకంలోకి కేతువు ప్రవేశించబోతున్నారు. ఈ మహా గోచరానికి ముందు జరిగిన నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక రంగం మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలను అందించనుందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందవచ్చో పరిశీ...