భారతదేశం, డిసెంబర్ 21 -- బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. ఇందులో భాగంగా కీలక విషయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పార్టీ గుర్తులతో జరిగితే బీఆర్ఎస్ సత్తా తెలిసేదన్నారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు.. అహంకార వైఖరి ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఒక కొత్త పాలసీ కూడా తేలేదని చెప్పారు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్ ఎస్టేట్ కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు.

Publish...