Telangana,hyderabad, జూలై 31 -- రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేయడానికి అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం ఇంధన శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉపముఖ్యమంత్రి భట్టితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. NPDCL, SPDCL లతో పాటు కొత్తగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని పరిధిలోకి వ్యవసాయ రంగంతో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకురావాలన్నారు. దీనికి రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని చెప్పారు.

కొత్త డిస్కమ్ ఏర్పాటు వల్ల ఇపుడున్న డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని సీఎం రేవం...