భారతదేశం, ఆగస్టు 25 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ బైక్‌ను అడ్వెంచర్ లవర్స్‌కు సరిపోయేలా కఠినమైన రోడ్లపై పరీక్షిస్తోంది. అంతకుముందు ప్రీ-ప్రొడక్షన్ మోడల్ కొన్ని చిత్రాలను కంపెనీ పంచుకుంది. ఇప్పుడు కొత్త క్లియర్ ఇమేజ్‌లు బైక్ గురించి మరింత సమాచారాన్ని వెల్లడించాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక రైడ్ ఈవెంట్ నుంచి ఈ ఫోటోలు లీక్ అయినట్లు చెబుతున్నారు.

కొత్త ఈ హిమాలయన్‌లో అతిపెద్ద మార్పు దాని ఆల్-ఎలక్ట్రిక్ సెటప్. తాజా చిత్రాలలో బైక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పొడవైన విండ్‌స్క్రీన్, బ్లాక్-సిల్వర్ సైడ్ ప్యానెల్స్, కొత్త ఎల్ఈడీ ఇండికేటర్లతో కనిపించింది. పొడవైన సింగిల్ పీస్ సీటు, వెనుక లగేజీ ర్యాక్, గోల్డెన్ స్పోక్ వీల్స్, డ్యూయల్ పర్పస్ టైర్లు ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్‌ను ఇంజిన్ ప్రాంతంలో ఇన్‌స్టాల్ చేస్...