భారతదేశం, జనవరి 4 -- కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకానికి 90 టీఎంసీలు రావాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలా కుదరకపోతే జూరాల నుంచి నేరుగా నీటిని తరలిస్తామని కూడా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో బనకచర్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నీళ్లు - నిజాలు' అన్న అంశంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చ...