భారతదేశం, జూన్ 16 -- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని సంభాషణలు గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ట్రైబల్ రైట్స్ (విజయనగరం జిల్లా) అధ్యక్షుడు తుమ్మి అప్పల రాజు దొర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లా ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)కు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. పెద్ది చిత్రంలో ఉపయోగించిన 'కొండన కొడకా' వంటి పదాలు గిరిజన ప్రజల ఆత్మగౌరవాన్ని, భావోద్వేగాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయన్నారు. అందువల్ల ఆ పదాలను సినిమా నుండి తక్షణమే తొలగించేలా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్‌ను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు స్వయం...