భారతదేశం, ఆగస్టు 25 -- న్యూఢిల్లీ: దేశంలో ఇంధన డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం పోర్టు సమీపంలో ఒక అత్యాధునిక చమురు రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వ రంగ సంస్థ యోచిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం పరిశీలిస్తోంది.

ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి, వినియోగదారు దేశం మనదే. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ 2.5 మిలియన్ బ్యారెల్స్ పెరుగుతుందని అంచనా వేయగా, అందులో కేవలం భారత్‌లోనే రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ డిమాండ్ పెరగనుందని బీపీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా సోమవారం జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో తెలిపారు.

ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్ట...