భారతదేశం, సెప్టెంబర్ 23 -- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 25 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ నివేదిక తెలిపింది.

పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 26 నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27 నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25 నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది.

సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24 తేదీల్లో కోస్తా తీరం, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ...