భారతదేశం, సెప్టెంబర్ 2 -- రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదల (Stoppage) గడువును పొడిగించింది.

పండుగల సమయంలో సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు, ఐటీ ప్రాంతంలో నివసించే వారికి నేరుగా ప్రయాణ సౌలభ్యం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

దసరా. దీపావళి పండుగల రద్దీ కోసం 2026 అక్టోబర్ 27 నుండి 2026 నవంబర్ 10 వరకు (15 రోజుల పాటు) రైళ్ల నిలుపుదల కొనసాగుతుంది. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు 2026 డిసెంబర్ 18 నుండి 2027 జనవరి 19 వరకు (33 రోజు...