భారతదేశం, నవంబర్ 15 -- అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపం (చైన్‌సా)తో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు హేమంత్ అలియాస్ దుమ్ము (21) ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం క్షీణించడంతో.. పోలీసులు శుక్రవారం రాత్రి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించారు. ఈ వివరాలను పోలీసు అధికారులు శనివారం వెల్లడించారు.

నవంబర్ 9వ తేదీ రాత్రి ఆస్పత్రిలో మంచం మీద నుంచి కింద పడిన తర్వాత హేమంత్ ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి 'పల్మనరీ ఎంబాలిజం' (ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టడం) ఉన్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన వ్యాధి.

హేమంత్ ...